Archive | Kavitha RSS feed for this section

చిట్టి చెవులు

19 Jan
రోజు చేసే ప్రయాణంలో ఓ సన్నివేశం 
కలిగించెను మదిలో ఆలోచనల సమావేశం 
తండ్రి బండి నడపగా, తల్లి ఎత్తుకోగా 
అ పసి కళ్ళలో చెణుకులు 
అందించింది నాకు మధుర సందేశం 
అమ్మ పాటలు వింటూ హాయిగా నిదురించే ఆ వయస్సు 
శబ్దానికి అర్ధం తెలియని మనస్సు 
ఈ శబ్దాల రొద ఎలా భరిస్తోంది 
ఆ చిట్టి చెవులు ఎంత రోదిస్తున్నాయో 
ఎవరు వీరంతా ఎందుకున్నారు ఇక్కడ
ఈ ప్రయాణం ఏమిటి, మరి గమ్యం ఎక్కడ 
ఇలా ఎన్నో సందేహాలు ఆ బుజ్జి మనసుకి
Advertisements

ఏవి ఏవి

19 Jan
ఏవి ఆ సహజ సిద్ధమైన పర్వతాలు 
ఏవి ఆ ప్రక్రుతి ఐరావతాలు 
మన పండుగలు ఏమయ్యాయి, మన పద్ధతులు ఎలా మారాయి 
పల్లె పిల్లల కొంటె పనులు, ఆ కోటి కొమ్మొచ్చి ఆటలు 
వసంతాన కోయిలమ్మ పాటలు 
వెన్నెలలో ఆడుకునే సయ్యాటలు 
లంగా ఓణీలు కట్టుకుని మురిపించె పడుచు పిల్లలు 
ఊరంతా పండగలా జరిగే మన పెళ్ళిళ్ళు 
ప్రతి పండగకు హారతులు పట్టే చెల్లెళ్ళు 
ఏడిపించి ఊరిస్తూ తిరిగే కొంటె మరదళ్ళు 
ఏమయ్యాయి మన సంప్రదాయాలు, వైభోగాలు 
మళ్ళీ ఆ రోజులు వస్తాయి అని ఎన్నో ఆశలు 
అవి రావి అని తెలిస్తే మరల నిరాశలు 
నాలుగు పైసల కోసం ఏమేమి కోల్పోయాం 
అన్నీ సంపాదించి ఆనందాన్ని కోల్పోయాం 
ప్రతి రోజునీ ఒక పరుగులాటగా మార్చుకున్నాం 
ఎటు నుంచి ఎటు వచ్చాం 
ఇంకా ఇటు నుంచి ఎటు వెళ్తాం 

నీ హాయి

19 Jan
ఈ వేకువ నీ మోము నూతనంగా ఉందేమి?
అన్ని సోయగాలు కలిగి అధునాతనంగా ఉందేమి?
ఏమి కలలు కన్నావో నిన్నటి రేయి 
నా గురించే అన్న భావనలో ఎంతో హాయి 
నావి కాదు అని తెలిసినా, నీ కలలు నిజమవ్వాలి 
నీ హాయి కలకాలం నిలవాలి

తొలిసారి

30 Dec
తొలిసారి నిన్నే చూసి నా మనసే పులకించేను 
ఏదో అయిపోయెను ఏమీ మహిమా?
దీనిని ప్రేమే ప్రేమే అందునా, లేక ఆకర్షణే అందునా, ఏమీ మహిమా?

స్వర్గమే కనిపించే నీ కళ్ళలో, నీవే గుర్తొచ్చే నా మదిలో 
ఏమిటో గానీ దీని పేరు, ఎంతో హాయినిస్తోంది నాకు 
దీనిని ప్రేమే ప్రేమే అందునా, లేక ఆకర్షణే అందునా, ఏమీ మహిమా?

నా జీవితం నీకంకితం, నా హృదయం నీ సర్వస్వం 
నా ధ్యాస లోనూ నీవే, నా శ్వాస లోనూ నీవే 

ఓ హృదయమా ఇదే ప్రేమనీ తెలుసునా
తోలి చూపులో ప్రేమ కలిగెను మనసునా 

నీవే నా ప్రియతమా నీవే నా ప్రాణమా? 
నీవే జీవితమా ఈ ప్రేమ శాశ్వతమా?

ఎన్నెన్నోఆశలు

30 Dec
ఎన్నెన్నో ఆశలూ, కొన్నైనా తీరవే? 

ఈ హృదయ జ్వాలలు కలనైనా ఆరవే? 
ఎంత నీరు పోసినా ఈ మంటలు అసలారనే ఆరవే?
ఎన్ని కలలు కన్నా ఈ నయనాలు కలలు కనటం మానవే? 
అది కలనైనా నిజం కాదు, నా ఆశ అటువంటిదా?
మది క్షణమైనా ఊరుకోదు నా ధ్యాస అటువంటిదా? 
దీని కారణం నీవే చెలి, నా జీవనం నీకే సఖీ ఇక కరుణించవా?
నా ధ్యాసలో నీవే మరీ నా ఆశనూ నీవే మరీ ఇక కనిపించవా?

తీరెనుగా ఆశలూ పండెనుగా నా కలలు 
ఆరెనుగా జ్వాలలు వీడెను నిట్టూర్పులూ

శివ పూజకు – FEW LYRICS TRANSLATION

23 Dec
పరుగాపక పయనించవె తలపులనావా 
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ 
ఎదిరించిన సిడిగాలిని జయించినావా 
మది కోరిన మధుసీమలు వరించి రావా 
I love the song “Siva Poojaku” from the Telugu film “Swarna Kamalam” and especially these above lines. 
I just re-interpreted these lines, in my perspective and hope so these are liked.


O Mind, let the thoughts travel without a stop
By bowing to tides, you won’t reach the top
Win the airs of hinderances by being strong
Then you shall own the heavens you sought for so long

కాళోజీ జ్ఞాపకార్థం

9 Sep
ఆ కళ్ళు కళలకు ఆకళ్ళు 
ఆకళ్ళ కలలు ఆకళ్ళు 
కళలకు కళ్ళు ఆకళ్ళు 
కలలు ఆకళ్ళ ఆకళ్ళు   

—–కాళోజీ నారాయణరావు

These are the words of Kaloji Narayana Rao about the hunger deaths of our farmers.
This is in his memory of his 99th Birthday today (9th September). Sad that such poets have been forgotten by most of the the youth. Hopeful that such poets shall be embraced and remembered for long.